RAPO23 Gets an Exciting Update: RAPO23 క్రేజీ అప్‌డేట్.. హాలీవుడ్ రేంజ్‌లో రామ్ నెక్స్ట్ సినిమా

హాలీవుడ్ రేంజ్‌లో రామ్ నెక్స్ట్ సినిమా

Update: 2026-06-25 01:37 GMT

RAPO23 Gets an Exciting Update: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్. రామ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎన్నడూ లేని భారీ స్కేల్‌లో RAPO23 చిత్రం తెరకెక్కబోతోంది. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ పోతినేని ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. రామ్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా.. యాక్షన్, ఎమోషన్, గ్రాండియర్ కలబోసిన ఒక మైండ్ బ్లోయింగ్ కథతో ఈ సినిమా రూపొందుతోంది.

ఇక ఈ సినిమా బడ్జెట్ వివరాలు వింటే ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవ్వాల్సిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది కాస్ట్‌లియెస్ట్ మూవీగా RAPO23 నిలవనుంది. బడ్జెట్‌కు తగ్గట్టే ఇండియన్ సినిమాలోనే టాప్ టెక్నీషియన్స్‌ను ఈ సినిమా కోసం రంగంలోకి దించారు. నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ సినిమాటోగ్రాఫర్ తీరు ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తుండగా.. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఫైట్స్ కంపోజ్ చేసే పీటర్ హెయిన్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే పీటర్ హెయిన్ టీమ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ బ్లాక్స్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

మరోవైపు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఎ.ఎస్. ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలో భారీ సెట్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఒక భారీ సిటీ సెట్‌తో పాటు కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ కోసం స్పెషల్ సెట్స్ వేస్తున్నారు. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ కలయికలో వస్తున్న RAPO23.. రామ్ కెరీర్‌లో ఒక పక్కా గేమ్ ఛేంజర్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ , ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News