Rashmika Mandanna: గోండు యువతిగా రష్మిక మందన్న సరికొత్త అవతారం.. మైసా కేరళ షెడ్యూల్ పూర్తి..
మైసా కేరళ షెడ్యూల్ పూర్తి..
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో అత్యంత వైవిధ్యమైన పాత్రకు సిద్ధమవుతున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైసా చిత్రం కోసం రష్మిక తాజాగా కేరళలో ఒక సుదీర్ఘమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
కఠినమైన శిక్షణ.. హై-ఆక్టేన్ యాక్షన్
ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ చూడని విధంగా ఒక గిరిజన గోండు యువతి పాత్రలో కనిపించనున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా ఈ చిత్రంలోని సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల కోసం రష్మిక థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అక్కడ ప్రతిరోజూ సుమారు 8 గంటల పాటు కఠినమైన శిక్షణ పొందిన రష్మిక, యాక్షన్ షెడ్యూల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రష్మిక చేతిలో 'మైసా'తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి నటిస్తున్న కాక్‌టెయిల్ 2 జూన్ 19న విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే పీరియడ్ డ్రామాలో కూడా ఆమె నటిస్తున్నారు.