Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. షూటింగ్‌లో గాయపడి కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్న ఆమె.. పూర్తిగా కోలుకుని ఎట్టకేలకు తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మైసా' చిత్ర షూటింగ్‌లో భాగంగా ఓ పాటకు డ్యాన్స్ చేస్తుండగా రష్మిక తుంటి భాగంలో బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆమెకు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న రష్మిక.. తరచూ తన హెల్త్ అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉన్నారు. తాజాగా షూటింగ్‌కు బయలుదేరుతూ.. ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. వరలక్ష్మి వ్రతం చేసిన ఫొటోలతో పాటు, ఇంట్లో తాను సరదాగా ఆడుకున్న పజిల్ చిత్రాలను షేర్ చేస్తూ.. 'తిరిగి షూట్‌కు వెళ్తున్నా.. కానీ, ఈ క్షణాలను మాత్రం కచ్చితంగా మిస్ అవుతాను' అంటూ భావోద్వేగపు పోస్ట్ పెట్టారు.

ఎట్టకేలకు తమ అభిమాన నటి తిరిగి షూటింగ్‌కు వెళ్లడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'క్వీన్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్లు చేస్తూ.. ఇకపై షూటింగ్‌లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమెకు సూచిస్తున్నారు.

Tags: