Ravi Teja–Sree Vishnu Multistarrer: రవి తేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్: ఆ హీరోయిన్ ఔట్.. ఈ బ్యూటీ ఇన్?
ఈ బ్యూటీ ఇన్?
Ravi Teja–Sree Vishnu Multistarrer: రవి తేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ చిత్రంలో నూతన హీరోయిన్ల ఎంపికపై మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. 'రాజ రాజ చోర' fame దర్శకుడు హసిత్ గోలి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రవి తేజ, శ్రీవిష్ణు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్రాజు నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సినిమా లాంచ్ చేయడానికి ముందే మేకర్స్ తారాగణాన్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
అయితే, ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్ల పాత్రల కోసం మొదట పూజా హెగ్డే, ఐశ్వర్య రాజేష్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం, ప్లాన్లలో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఐశ్వర్య రాజేష్ స్థానంలో ఒక ప్రధాన పాత్ర కోసం డింపుల్ హయాతిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతుండగా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు పూజా హెగ్డే ఎంపిక కూడా ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే నెల నుంచి సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.