Relief for Naga Chaitanya in Delhi High Court: తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, ముఖరూపాన్ని వాడుకుంటూ మర్చండైజ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఏఐ (AI) ద్వారా సృష్టించిన కంటెంట్, అలాగే ఆన్‌లైన్ వీడియోలను సర్క్యులేట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నాగచైతన్య కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ జస్టిస్ జ్యోతి సింగ్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. నాగచైతన్య తరఫున సీనియర్ అడ్వకేట్ వైభవ్ గగ్గర్ వాదనలు వినిపిస్తూ... కొన్ని వెబ్‌సైట్లు నాగచైతన్య పేరును అభ్యంతరకరమైన సెర్చ్ వర్డ్స్‌తో లింక్ చేసి, తమ సైట్లకు ట్రాఫిక్ పెంచుకోవడానికి వాడుకుంటున్నాయని కోర్టుకు తెలిపారు. దీనివల్ల ఆయన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని, అంతేకాకుండా ఆయన అనుమతి లేకుండా ఆయన రూపంతో కూడిన మర్చండైజ్ విక్రయిస్తున్నారని కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. వాదనలు విన్న న్యాయస్థానం నాగచైతన్యకు అనుకూలంగా మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రతివాదులు తమ సమాధానాలను సమర్పించిన తర్వాత తదుపరి విచారణ జరగనుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే... నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' అనే మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Tags: