Rishab Shetty: రుక్మిణి వసంత్‌ను అన్‌ఫాలో చేసిన రిషబ్ శెట్టి
అన్‌ఫాలో చేసిన రిషబ్ శెట్టి
Rishab Shetty: 'కాంతార' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నటి రుక్మిణి వసంత్‌ను అన్‌ఫాలో చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ త్వరలో రాబోతున్న 'కాంతార: చాప్టర్ 1' (Kantara: Chapter 1) చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ అన్‌ఫాలో వ్యవహారం కేవలం నటికే పరిమితం కాలేదు. రిషబ్ శెట్టి అంతకుముందే తనను స్టార్‌గా నిలబెట్టిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థను, అలాగే తన ఆప్తమిత్రుడు మరియు దర్శకుడు రాజ్ బి. శెట్టిని కూడా అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. భారీ విజయాలను అందించిన హోంబలే ఫిలింస్ బ్యానర్‌కు, రిషబ్‌కు మధ్య ఏవో విభేదాలు తలెత్తాయని, అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే రిషబ్ శెట్టి తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. అలాగే తెలుగులో 'జై హనుమాన్' అనే భారీ ప్రాజెక్టుకు కూడా సంతకం చేశారు. తన కెరీర్‌లో కొత్త అడుగులు వేస్తున్న క్రమంలోనే పాత మిత్రులకు, నిర్మాణ సంస్థలకు దూరం జరుగుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ విషయంలో రిషబ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.