‘Rockstar’ Beauty: టాలీవుడ్‌కి ‘రాక్‌స్టార్’ బ్యూటీ ఎంట్రీ
‘రాక్‌స్టార్’ బ్యూటీ ఎంట్రీ
‘Rockstar’ Beauty: బాలీవుడ్ సెన్సేషన్, ‘రాక్‌స్టార్’ ఫేమ్ నర్గీస్ ఫక్రీ ఎట్టకేలకు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. గతంలో పలువురు తెలుగు దర్శకులు ఈ భామను ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రయత్నించినప్పటికీ, అవి కుదరలేదు. కానీ, ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడింది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. నర్గీస్ ఫక్రీ తన మొదటి తెలుగు సినిమా కోసం ఒక స్పెషల్ గ్లామర్ సాంగ్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసేసింది.
యువ హీరో హవీష్ ('నువ్విలా', 'సెవెన్' ఫేమ్) హీరోగా, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్‌టైనర్ “నేను రెడీ”. ఈ సినిమాలోనే నర్గీస్ ఫక్రీ ఒక అదిరిపోయే స్పెషల్ నంబర్ (ఐటెం సాంగ్)తో తెలుగు స్క్రీన్‌పై మెరవబోతోంది. ఈ రోజు మేకర్స్ నర్గీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆమెను "అల్టిమేట్ గ్లామ్ బ్లాస్ట్" అని వర్ణించారు.
"టాలీవుడ్ స్క్రీన్‌పై మొదటిసారి.. అత్యంత హాట్ అండ్ గ్లామరస్ నర్గీస్ ఫక్రీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌తో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది." అంటూ చిత్ర బృందం ఈ పోస్టర్‌ను షేర్ చేసింది.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో నర్గీస్ ఫక్రీ మెరిసిపోయే సిల్వర్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో క్యాండిల్స్ (కొవ్వొత్తులు), రెడ్ అండ్ బ్లూ లైటింగ్, నీటి ప్రతిబింబాల మధ్య డాన్సర్స్ తాలూకు సిల్హౌట్స్ (నీడలు) చూస్తుంటే.. ఈ పాటను విజువల్‌గా చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. థియేటర్లలో ఈ సాంగ్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ తీయడంలో దిట్ట అయిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటం, దానికి తోడు నర్గీస్ ఫక్రీ గ్లామర్ తోడవడంతో 'నేను రెడీ' సినిమాపై ఇండస్ట్రీలో అప్పుడే క్రేజ్ మొదలైంది.