Roja Set for Re-Entry: రీఎంట్రీ ఇస్తున్న రోజా.. డీ గ్లామరస్ రోల్‌లో సీనియర్ నటి..
డీ గ్లామరస్ రోల్‌లో సీనియర్ నటి..
Roja Set for Re-Entry: మాజీ స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా మళ్లీ సినిమాలు చేయబోతున్నారు.ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఆమె రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని, సినిమాలపై దృష్టి పెట్టారు. తమిళ చిత్రంతో ఆమె రీ-ఎంట్రీ ఇవ్వనుంది. డైరెక్టర్ బాలచంద్రన్ తెరకెక్కిస్తున్న
లెనిన్ పాండ్యన్ మూవీలో కీలక పాత్రలో ఆమె నటించనున్నారు.
క్వీన్ ఈజ్ బ్యాక్
రోజా స్నేహితురాలు.. నటి ఖుష్బూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసి రోజా రీ-ఎంట్రీని ప్రకటించారు. ఈ వీడియోలో 90ల నాటి రోజా హిట్ సినిమాల క్లిప్స్‌తో పాటు కొత్త సినిమాలోని ఆమె లుక్‌ను చూపించారు.90s క్వీన్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ వీడియో అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
డీ-గ్లామరస్ పాత్రలో రోజా
ఈ చిత్రంలో రోజా డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వయసు పైబడిన, విషాదంలో ఉన్న మహిళగా ఆమె పాత్ర రూపుదిద్దుకోనుంది. గతంలో తెలుగు, తమిళ భాషల్లో 125కు పైగా చిత్రాల్ అగ్ర కథానాయికగా రోజా వెలుగొందారు. రాజకీయాల్లో మంత్రిగా ఉన్నప్పుడు సినిమాలకు.. జబర్దర్త్ వంటి టీవీ షోలకు కూడా పూర్తిగా దూరమయ్యారు.ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారడంతో ఆమె మళ్లీ సినిమా, టీవీ రంగాల్లో బిజీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.