‘Romanchakam’: సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ‘రోమాంచకం’: క్రేజీ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఖరారు!
క్రేజీ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఖరారు!
‘Romanchakam’: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘రోమాంచకం’. ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమాలోని సున్నితమైన ప్రేమ మరియు భావోద్వేగ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
సినిమాటోగ్రాఫర్ పవన్ పప్పుల అందించిన విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉండగా, వాసుకి వైభవ్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫీల్‌గుడ్‌గా సాగింది. ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ, వారి ప్రేమ కథతో పాటు వారి మధ్య వచ్చే ఎమోషనల్ దూరాన్ని ఈ గ్లింప్స్‌లో ఆసక్తికరంగా చూపించారు. అద్భుతమైన విజువల్స్, హృదయానికి హత్తుకునే కథాంశం మరియు యూత్‌ఫుల్ వైబ్‌తో వస్తున్న ‘రోమాంచకం’ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.