Roshan Kanakala: రోషన్ కనకాల నెక్స్ట్ సినిమా ఫిక్స్

సినిమా ఫిక్స్

Update: 2026-07-11 02:32 GMT

Roshan Kanakala: యువ నటుడు రోషన్ కనకాల తన తదుపరి సినిమాను ఒక వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేశారు. ఈ సరికొత్త చిత్రం శుక్రవారం ఉదయం సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా మలయాళ బ్యూటీ గహాజీ షిజు కున్నాత్ టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమవుతోంది. రోషన్ సరసన ఆమె ఈ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్లు సత్య, సుదర్శన్, అలాగే రవితేజ నన్నిమాల ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విజయ్ కె. కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగులో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కథలను అద్భుతంగా తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ ఈ చిత్రానికి కథను అందించారు.

గుట్టా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది. ఈ ముహూర్తపు షాట్‌కు ప్రముఖ హీరో నిఖిల్ క్లాప్ కొట్టగా, టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఒకే కథలో ఫాంటసీ, లవ్, కామెడీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అంశాలన్నీ కలగలిపి ఈ సినిమాను చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News