Champion Movie Public Talk: రోషన్ చాంపియన్ మూవీ పబ్లిక్ టాక్

పబ్లిక్ టాక్

Update: 2025-12-25 04:32 GMT

Champion Movie Public Talk: శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక (Roshan Meka) కథానాయకుడిగా నటించిన పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా 'చాంపియన్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 1948 నాటి హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో, భైరాన్‌పల్లి రజాకార్ల దమనకాండ, ఫుట్‌బాల్ క్రీడను మిళితం చేస్తూ తీసిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది.

ఇది 1948 నాటి చారిత్రక కథ. నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలను ఎదుర్కొన్న భైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. హీరో మైఖేల్ (రోషన్) ఒక గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కంటాడు. కానీ తన గ్రామంలో జరుగుతున్న అన్యాయాల వల్ల అతని జీవితం ఏ మలుపు తిరిగింది? ఆట ద్వారా తన ఉనికిని ఎలా చాటుకున్నాడు? అనేదే ఈ 'చాంపియన్' కథ.

పెళ్లిసందడి'లోని లవర్ బాయ్ ఇమేజ్ నుండి రోషన్ పూర్తిగా మారిపోయాడు. ఒక అథ్లెట్‌కు ఉండాల్సిన ఫిజిక్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాక్షన్ సీన్లలో చాలా ఈజ్ చూపించాడు. సినిమా విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ మధీ కెమెరా పనితనం, పీరియడ్ సెట్టింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన నేపథ్య సంగీతం , 'గిర గిర' వంటి పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి.

మలయాళ నటి అనస్వర రాజన్ తెలుగులో మంచి అరంగేట్రం చేసింది. ఇంటర్వెల్ బ్లాక్ , ప్రీ-క్లైమాక్స్ ఫుట్‌బాల్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా రన్ టైమ్ (సుమారు 169 నిమిషాలు) చాలా ఎక్కువగా ఉందని, కొన్ని సీన్లు సాగతీసినట్లుగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు.స్పోర్ట్స్ డ్రామా, చారిత్రక అంశాలను (భైరాన్‌పల్లి రివోల్ట్) బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు ప్రదీప్ అద్వైతం కొంత తడబడ్డారని, స్క్రీన్‌ప్లే మరింత బలంగా ఉండాల్సిందని విమర్శలు వస్తున్నాయి.

మొత్తానికి 'చాంపియన్' ఒక సిన్సియర్ అటెంప్ట్. చారిత్రక అంశాలతో కూడిన స్పోర్ట్స్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది నచ్చుతుంది. రోషన్ నటన కోసం, గ్రాండ్ విజువల్స్ కోసం ఒకసారి చూడవచ్చు.

Tags:    

Similar News