‘Vrushakarma’ Glimpse : నాగచైతన్య రఫ్ లుక్.. మార్చి 5న వృషకర్మ గ్లింప్స్

మార్చి 5న వృషకర్మ గ్లింప్స్

Update: 2026-02-26 06:42 GMT

‘Vrushakarma’ Glimpse : నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. మిథికల్ థ్రిల్లర్‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, బిహైండ్ ది సీన్‌‌ వీడియోస్‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. బుధవారం ఫస్ట్ గ్లింప్స్‌ గురించిన అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్‌‌. ‘వృషకర్మ’ ఆధ్యాత్మిక ప్రపంచంలోని మొదటి స్నీక్ పీక్‌‌ను మార్చి 5న విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌‌మెంట్ పోస్టర్‌‌లో చీకటి గుహలో నిలబడ్డ నాగచైతన్య ఇంటెన్స్‌‌ లుక్‌‌ ఇంప్రెస్‌‌ చేసింది. నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రంలో ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. రాహుల్ డి హెరియన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అజనీష్‌‌ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News