Sai Tej’s New Film: హీరో సాయి తేజ్ తన తదుపరి సినిమాను ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా #SDT19 చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమాతో తేజ కాకుమాను ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

“బాహుబలి” వంటి సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను, “సేవ్ ది టైగర్స్” వంటి పాపులర్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన సాయి దుర్ఘ తేజ్ కోసం ప్రత్యేకంగా ఓ కథను సిద్ధం చేశారు. ఇందులో సాయి దుర్ఘ తేజ్‌ను ఇంతకుముందెన్నడూ చూడని కొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. కథ, తన పాత్ర నచ్చడంతో సాయి దుర్ఘ తేజ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను కూడా నిర్మించిన అనుభవం ఉన్న నిర్మాత అనిల్ సుంకర, ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Tags: