Samantha:ఎట్టకేలకు ఆ టాటూను తొలగించిన సమంత
టాటూను తొలగించిన సమంత;
Samantha:హీరోయిన్ సమంత.. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుని నాలుగేళ్లు అయ్యింది. 2021 అక్టోబర్ లో విడాకులు తీసుకున్న ఈ జంట.. అప్పటినుంచి ఎవరి లైఫ్ లో వారు బిజీ ఉంటున్నారు. పెళ్లికి సంబంధించి గుర్తులను ఇద్దరూ చెరిపేశారు. అయితే సమంత తన టాటూను మాత్రం ఇప్పటివరకు తొలగించలేదు. ఇప్పుడు దానిని తొలగించినట్లు తెలుస్తోంది.
సమంత ఏ మాయ చేసావే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. చైతు-సామ్ నటించి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక్కడ మొదలైన వారి పరిచయం పెళ్లివరకు వెళ్లింది. అందుకే సమంతకు ఏ మాయ చేసావే సినిమా అంటే ప్రత్యేకమైన ఇష్టం. నటి సమంత ఆ సినిమా పేరును తన వీపుపై టాటూగా వేయించుకుంది. 'YMC' (యే మాయ చేశావే) అనే పదాలను టాటూగా వేయించుకుంది.
విడాకుల తర్వాత కొన్ని టాటూలను తొలగించుకున్న సమంత.. ఏ మాయ చేశావే టాటూను మాత్రం తొలగించలేదు. ఇప్పుడు ఏ మాయ చేశావేటాటూను కూడా తొలగించింది. ఇంతకుముందు ఆ టాటూ సమంత ఫోటోలలో కనిపించింది. కానీ ఇప్పుడు ఆ టాటూ సమంత వీపు మీద లేదు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత చిత్రాన్ని చూసిన కొంతమంది నెటిజన్లు దానిని గుర్తించి పోస్ట్‌లను షేర్ చేశారు. కాగా విడాకుల తర్వాత చైతన్య శోభితను పెళ్లి చేసుకోగా.. సమంత డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.