‘Maa Inti Bangaram’ Release Date: తూటా పట్టిన సమంత.. 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్!

'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్!

Update: 2026-05-14 06:38 GMT

‘Maa Inti Bangaram’ Release Date: సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటిస్తున్న 'మా ఇంటి బంగారం' సినిమా 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు 'తస్సదియ్య' పాటతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్ 19, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో సమంత ట్రెడిషనల్ చీర కట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని పవర్‌ఫుల్ అవతారంలో కనిపిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ తర్వాత వస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి.

మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా.. సమంత మరియు హిమాంక్ దువ్వురుతో కలిసి 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. కమర్షియల్ హంగులున్న ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

Tags:    

Similar News