Maa Inti Bangaram: ఓటీటీలోకి వచ్చేసిన సమంత బ్లాక్‌బస్టర్ మా ఇంటి బంగారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Update: 2026-07-17 06:00 GMT

Maa Inti Bangaram: స్టార్ బ్యూటీ సమంత సుమారు మూడేళ్ల లాంగ్ బ్రేక్ తర్వాత వెండితెరపై సృష్టించిన మ్యాజిక్ 'మా ఇంటి బంగారం'. థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పై సందడి చేసేందుకు వచ్చేసింది.

రూ. 100 కోట్ల క్లబ్ హిస్టరీ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సరికొత్త రికార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. ముందుగా అనుకున్న ప్రకారమే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ..

ఈ యాక్షన్ కామెడీ డ్రామాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. థియేటర్లలో ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే స్థాయి రెస్పాన్స్ దక్కించుకుంటుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

సమంత - నందిని రెడ్డి హ్యాట్రిక్ కాంబో

గతంలో ఓ బేబీ వంటి క్రేజీ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి, మరోసారి సమంతతో కలిసి ఈ చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు మరో హైలైట్ ఏంటంటే.. సమంత స్వయంగా నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ ట్రాలాలా పిక్చర్స్ పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

వరుస ఫ్లాపుల తర్వాత గ్యాప్ తీసుకున్న సమంతకు ఈ చిత్రం గట్టి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు హ్యాపీగా జియో హాట్‌స్టార్'

లో వీక్షించవచ్చు.

Tags:    

Similar News