Samantha’s Special Wishes: అఖిల్ లెనిన్ మూవీకి సమంత క్రేజీ విషెస్.. పోస్ట్ వైరల్..

పోస్ట్ వైరల్..

Update: 2026-07-10 11:15 GMT

Samantha’s Special Wishes: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ సరికొత్త చిత్రం లెనిన్ నేడు (జూలై 10) థియేటర్లలోకి వచ్చేసింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ స్క్రీన్ మీద కనిపించడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్ హీరోయిన్ సమంత.. అఖిల్‌కు, లెనిన్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

బ్లాక్‌బస్టర్ వైబ్స్ అంటూ సమంత ఇన్‌స్టా స్టోరీ..

సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లెనిన్ చిత్ర ట్రైలర్‌ను షేర్ చేస్తూ ఒక క్రేజీ క్యాప్షన్ పెట్టారు. అఖిల్‌ను ట్యాగ్ చేస్తూ.. "లెనిన్ టీమ్‌కు, అఖిల్‌కు ఆల్ ది బెస్ట్.. ఈ సినిమా చూస్తుంటే ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి" అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారడంతో అటు నెటిజన్లు, ఇటు అక్కినేని అభిమానులు దీనిపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.

అఖిల్ కూడా సమంత సినిమాను మెచ్చుకున్నారు..

నిజానికి వీరిద్దరి మధ్య ఈ పాజిటివ్ వైబ్స్ కొన్ని రోజుల క్రితమే మొదలయ్యాయి. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమాపై అఖిల్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ ప్రమోషన్ల ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. సమంత సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని, సినిమా వైబ్ బాగుందని కొనియాడారు. ఇప్పుడు దానికి కౌంటర్‌గా సమంత కూడా అఖిల్ సినిమాకు సపోర్ట్ ఇవ్వడం విశేషం.

బాక్సాఫీస్ వద్ద లెనిన్ జోరు..

చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అఖిల్ కెరీర్‌కు ఇది చాలా కీలకంగా మారింది. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. అటు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్, ఇటు సమంత లాంటి స్టార్స్ నుండి సపోర్ట్ లభిస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Tags:    

Similar News