Sameera Reddy: నత్తితో చాలా ఇబ్బంది పడ్డా: సమీరా రెడ్డి
సమీరా రెడ్డి
Sameera Reddy: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక కూడా ఎన్నో కన్నీళ్లు, కష్టాలు ఉంటాయని నిరూపించారు నటి సమీరా రెడ్డి. వెండితెరపై ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించే ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద బలహీనతతో యుద్ధం చేశానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.
సమీరా రెడ్డి తన చిన్నతనంలో ఎదుర్కొన్న అతిపెద్ద అవమానం ఇదే. స్కూల్ కి వెళ్లాలంటే భయం.. ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేక తడబడటం.. తోటి పిల్లల వెటకారాలు.. ఇవన్నీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. "నేను ఎవరికీ పనికిరాను.. సరిగ్గా మాట్లాడలేను" అని తనని తాను తక్కువ చేసుకుని ఎన్నో రాత్రులు ఏడ్చానని ఆమె గుర్తుచేసుకున్నారు.కానీ సమీరా అక్కడే ఆగిపోలేదు. తన బలహీనతను బలశక్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో 'స్పీచ్ థెరపీ' తీసుకున్నారు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి మాట్లాడటం ప్రాక్టీస్ చేశారు. మాటలో స్పష్టత కోసం, శ్వాసపై నియంత్రణ కోసం నిరంతరం శ్రమించారు.
చివరికి ఏ సమస్య వల్ల అయితే అవమాన పడ్డారో.. అదే మాటలతో వెండితెరపై డైలాగులు చెప్పారు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ సరసన 'నరసింహుడు', 'అశోక్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈరోజు సమీరా రెడ్డి కేవలం నటి మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే 'మెంటార్'. "లోపాలు అందరికీ ఉంటాయి.. వాటిని చూసి సిగ్గుపడకండి.. వాటిని అంగీకరించి ముందుకు సాగండి అని ఆమె గొంతెత్తి చాటుతున్నారు. ఆమె ప్రయాణం మనకు నేర్పే పాఠం ఒక్కటే.. నీ లోపాన్ని నువ్వు ప్రేమిస్తే.. అది నీ విజయానికి దారి తీస్తుంది.