Actor Sanjay Dutt: సంజయ్ సరికొత్త రికార్డ్.. వెయ్యికోట్ల క్లబ్ లోకి మూడు సినిమాలు

వెయ్యికోట్ల క్లబ్ లోకి మూడు సినిమాలు

Update: 2026-03-31 05:47 GMT

Actor Sanjay Dutt: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చ వస్తే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు వెయ్యి కోట్ల క్లబ్ సినిమాల్లో నటించిన ఏకైన భారతీయ నటుడిగా సరికొత్తచరిత్ర సృష్టించాడు. ఆయన సాధించిన ఈ అరుదైన రికార్డులో షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్ వంటి స్టార్లను సైతం వెనక్కి నెట్టాడు. ఈ ప్రయాణం కేజీఎఫ్ 2తో మొదలైంది. అందులో సంజయ్ దత్ అధీర గా పోషించిన క్రూరమైన విలన్ పాత్రకు గొప్ప పేరు వచ్చింది. ఈ మూవీ రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత జవాన్ చిత్రంలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరిశాడు. కేవలం కొద్ది నిమిషాల పాటే తెరపై కనిపిం చినా ఆ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేయడంతో అతడి ఖాతాలో మరో వెయ్యి కోట్ల సినిమా చేరింది. తాజాగా ధురంధర్ 2 కూడా రూ.1000 కోట్ల క్లబ్లో చేరడంతో సంజయ్ దత్ ఖాతాలో మూడో వెయ్యి కోట్ల క్లబ్ సినిమా నమోదైంది. తన సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ.. బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయాల సు అందుకుంటున్న ఆయన ఇప్పుడు. ఇండియన్ సినిమాకు గోల్డెన్ లెగ్ గా మారిపోయాడు.

Tags:    

Similar News