Satyadev: సత్యదేవ్ రావు బహదూర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

రావు బహదూర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Update: 2026-04-27 04:14 GMT

Satyadev: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రావు బహదూర్' థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ వంటి క్లాసిక్ సినిమాను అందించిన వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

విడుదల చేసిన పోస్టర్‌లో సత్యదేవ్ అత్యంత రాజసం ఉట్టిపడేలా, గంభీరమైన సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఒక పక్క అధికారం, మరోపక్క రహస్యంతో కూడిన ఆయన లుక్ సినిమాపై అమితమైన ఆసక్తిని పెంచుతోంది. ఒకప్పుడు వైభోగంగా వెలిగి, ప్రస్తుతం కనుమరుగవుతున్న రాచరికపు నేపథ్యాన్ని, సైకలాజికల్ డ్రామాను మిళితం చేస్తూ ఈ సినిమాను మలిచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో మలయాళ నటి దీపా థామస్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోధ్కర్ దంపతులకు చెందిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఏ+ఎస్ మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న 'రావు బహదూర్', సత్యదేవ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News