Chiru Shares an Emotional Tweet: సీన్ రివర్స్.. 30 ఏళ్ల క్రితం అన్నయ్య.. నేడు తమ్ముడు.. చిరు ఎమోషనల్ ట్వీట్..

నేడు తమ్ముడు.. చిరు ఎమోషనల్ ట్వీట్..

Update: 2026-05-21 15:48 GMT

Chiru Shares an Emotional Tweet: టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ ఎమోషనల్ అండ్ మెమరబుల్ మూమెంట్ ఒకటి ఇవాళ ఆవిష్కృతమైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 158వ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ ఓపెనింగ్ వేడుక కేవలం ఒక సినిమా ముహూర్తంగా మాత్రమే మిగిలిపోకుండా, 30 ఏళ్ల నాటి ఓ అద్భుతమైన జ్ఞాపకాన్ని వెండితెరపై పునరావృతం చేసింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన అన్నయ్య చిరంజీవిపై తీసిన ముహూర్తపు షాట్‌కు పవన్ కల్యాణ్ క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఆరోజు అన్నయ్య.. ఈరోజు తమ్ముడు: 30 ఏళ్ల నాటి క్లాసిక్ ఫ్లాష్‌బ్యాక్

ఈ క్లాప్ బోర్డ్ వెనుక ఉన్న ఒక అద్భుతమైన ఎమోషనల్ కనెక్షన్‌ను గుర్తుచేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "ఈ రోజు కల్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే... 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది.. అదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ" అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు.

అసలేం జరిగిందంటే:

సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం (1996లో), పవన్ కల్యాణ్ హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆరోజు తమ్ముడిని వెండితెరకు పరిచయం చేస్తూ అన్నయ్య చిరంజీవి ముందుండి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఇవాళ కాలం చక్రంలా తిరిగింది. ఆరోజు అన్నయ్య క్లాప్ కొట్టి తమ్ముడిని ఆశీర్వదిస్తే.. ఈరోజు అదే తమ్ముడు ఏకంగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి, అన్నయ్య 158వ సినిమాకు క్లాప్ కొట్టారు. అంతస్తులు మారినా, హోదాలు పెరిగినా మెగా బ్రదర్స్ మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో చెప్పడానికి ఈ ఒక్క విజువల్ చాలు అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News