Seven Heroines in Krish’s Next Film: క్రిష్ నెక్స్ట్ సినిమాలో ఏడుగురు హీరోయిన్లా.. ? వదంతులపై దర్శకుడి క్లారిటీ..

వదంతులపై దర్శకుడి క్లారిటీ..

Update: 2026-02-14 07:34 GMT

Seven Heroines in Krish’s Next Film: టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై స్పష్టతనిచ్చారు. క్రిష్ తదుపరి చిత్రం ఒక అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, అందులో ఏకంగా ఏడుగురు హీరోయిన్లు నటించబోతున్నారని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

వదంతులకు చెక్ పెట్టిన క్రిష్

ఈ ప్రచారంపై స్పందించిన క్రిష్.. ఇది కేవలం సోషల్ మీడియాలో పుట్టిన మరో స్క్రిప్ట్ మాత్రమేనని కొట్టిపారేశారు. "ఏడుగురు హీరోయిన్లు, ట్రెక్కింగ్ అడ్వెంచర్.. వినడానికి ఐడియా బాగుంది కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు" అని తనదైన శైలిలో ఈ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టారు. తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను అతి త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

వైవిధ్యమైన దర్శకుడిగా గుర్తింపు

గమ్యం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన క్రిష్.. వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి ఆలోచనాత్మక చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన హరి హర వీరమల్లు, ఘాటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. బయోపిక్స్‌ నుంచి సోషల్ డ్రామాల వరకు ప్రతి చిత్రంలోనూ తనదైన ముద్ర వేసే క్రిష్, ఇప్పుడు తన కొత్త సినిమాతో ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

క్రిష్ క్లారిటీ ఇవ్వడంతో ఆ ఏడుగురు హీరోయిన్ల అడ్వెంచర్ కేవలం పుకారు మాత్రమేనని తేలిపోయింది. మరి ఆయన అధికారికంగా ప్రకటించబోయే ఆ కొత్త సినిమా విశేషాల కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News