Sharwanand–Sreenu Vaitla’s Crazy Project: శర్వానంద్ - శ్రీనువైట్ల క్రేజీ ప్రాజెక్ట్: టైమ్ ట్రావెల్ తో వస్తున్న కామెడీ మాంత్రికుడు.. హీరోయిన్ ఎవరంటే?

హీరోయిన్ ఎవరంటే?

Update: 2026-05-14 13:08 GMT

Sharwanand–Sreenu Vaitla’s Crazy Project: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్, వినోదానికి కేరాఫ్ అడ్రస్ అయిన సీనియర్ దర్శకుడు శ్రీనువైట్ల కలయికలో ఒక వినూత్న చిత్రం పట్టాలెక్కబోతోంది. శ్రీనువైట్ల అనగానే మనకు గుర్తొచ్చేది హిలేరియస్ కామెడీ. అయితే ఈసారి ఆయన తన మార్క్ హ్యూమర్‌కు సైన్స్ ఫిక్షన్. ఎలిమెంట్స్‌ను జోడించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయబోతున్నారు.

కామెడీ ప్లస్ సైన్స్ ఫిక్షన్

ఈ సినిమా ప్రధానంగా టైమ్ ట్రావెలకాన్సెప్ట్‌తో సాగనుందని సమాచారం. శర్వానంద్ సహజసిద్ధమైన టైమింగ్‌కు, శ్రీనువైట్ల మార్క్ కామెడీ తోడైతే వెండితెరపై మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శర్వానంద్ సరసన మానస వారణాసి

ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు కూడా దాదాపు తెరపడింది. ఎందరో స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించినా, చివరికి మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమాతో నటిగా మెప్పించిన మానసకు శర్వానంద్ పక్కన ఇది ఒక బిగ్ బ్రేక్ అని చెప్పాలి. ఈ కొత్త జంట వెండితెరపై ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్‌ను అందించబోతోంది.

Tags:    

Similar News