Shefali Jariwala:గుండెపోటుతో షఫాలీ జరివాలా కన్నుమూత
షఫాలీ జరివాలా కన్నుమూత;
Shefali Jariwala: నటి, మోడల్ షెఫాలి జరివాలా శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మరణించారు. నివేదికల ప్రకారం షెఫాలికి గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత ఆమె భర్త పరాగ్ త్యాగి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రి వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఆమె మరణ వార్త వినోద పరిశ్రమను, అభిమానులలో శోకసంద్రంలోకి నెట్టివేసింది. 2002లో 'కాంతా లగా' అనే సూపర్‌హిట్ పాటతో షెఫాలీ జరివాలా రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఆ తర్వాత 'ముజ్సే షాదీ కరోగి' వంటి చిత్రాలలో అనేక సంగీత ఆల్బమ్‌లలో పనిచేశారు. టీవీలో, ఆమె 'నాచ్ బలియే 5', 'బిగ్ బాస్ 13' వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఆమె మొదట హర్మీత్ గుల్జార్‌ను వివాహం చేసుకుంది తరువాత విడాకులు తీసుకుంది. తరువాత పరాగ్ త్యాగిని వివాహం చేసుకుంది. షెఫాలీ జరీవాలా 1982 డిసెంబర్ 15న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి పేరు సతీష్ జరీవాలా, తల్లి పేరు సునీతా జరీవాలా. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. అకస్మాత్తుగా మృతిచెందారని తెలియడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు ఇన్‌స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె మృతిపై సింగర్ మికా సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. 2015లో షఫాలీకి వివాహమైంది.