Shobhita: దేవత అవతారంలో శోభితా.. పిక్స్ వైరల్ !
పిక్స్ వైరల్ !
Shobhita: ఇండియా కౌచర్ వీక్ 2026లో నటి శోభితా ధూళిపాళ తన అద్భుతమైన దేవత అవతారంలో మెరిసి, ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. నటిగా మారడానికి ముందే మోడల్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభిత, నాగచైతన్యను వివాహమాడిన తర్వాత కూడా ప్రముఖ డిజైనర్ల కోసం ర్యాంప్‌పై సందడి చేస్తూనే ఉన్నారు.
ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ప్రత్యేక దుస్తులలో శోభిత షోస్టాపర్‌గా నిలిచారు. పవిత్రమైన ‘దేవి’ రూపంలో ఆమె చూపిన రాయల్ లుక్, రాజసంతో కూడిన నడక ఈ ఈవెంట్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ కాన్సెప్ట్ గురించి డిజైనర్ రాహుల్ మిశ్రా వివరిస్తూ.. "దేవి అనేది ఒక పాత్ర మాత్రమే కాదు, శతాబ్దాలుగా నిలిచి ఉన్న ఒక ఆలోచన" అని పేర్కొన్నారు. 11వ శతాబ్దానికి చెందిన కంచు విగ్రహాల రూపురేఖల నుంచి ప్రేరణ పొంది ఈ డిజైన్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు. తరతరాలుగా శిల్పులకు, కళాకారులకు స్ఫూర్తిగా నిలిచిన శాశ్వతమైన దేవతా రూపానికి శోభిత తన నడకతో ప్రాణం పోశారని, శృంగార రసాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన సాగిందని రాహుల్ మిశ్రా వెల్లడించారు.
శోభిత కూడా ఈ ఈవెంట్‌కు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.