Shobita’s Journey into ‘Cheekatilo’: ప్రైమ్ వీడియోలో శోభిత 'చీకటిలో' ప్రయాణం

శోభిత 'చీకటిలో' ప్రయాణం

Update: 2026-01-09 06:42 GMT

Shobita’s Journey into ‘Cheekatilo’: నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'చీకటిలో' నేరుగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్స్‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్ నగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇందులో శోభితా ధూళిపాళ్ల 'సంధ్య' అనే క్రైమ్ పాడ్‌కాస్టర్ పాత్రలో నటిస్తోంది. తన ఇంటర్న్ మిస్టరీ మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసే క్రమంలో సంధ్యకు ఎదురైన భయంకరమైన నిజాలు, నగరంలోని చీకటి కోణాలు ఈ సినిమా ప్రధానాంశం. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ హీరోగా నటించగా.. ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, చైతన్య విశాలక్ష్మి, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న థ్రిల్లర్: సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'దూత' వెబ్ సిరీస్ మాదిరిగానే, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఒక విభిన్నమైన థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి చంద్ర పెమ్మరాజు, శరన్ కొప్పిశెట్టి కథను అందించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.

Tags:    

Similar News