Singer Naga Durga: సింగర్ నాగ దుర్గ జాక్‌పాట్..సుకుమార్-బన్నీ వాస్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్!

హీరోయిన్ ఛాన్స్!

Update: 2026-06-20 05:21 GMT

Singer Naga Durga: తిన్న తీరం పడుతలే’, ‘దారి పొంటత్తుడు’ లాంటి సూపర్ హిట్ జానపద గీతాలతో యూట్యూబ్‌ను షేక్ చేసిన నల్గొండ సింగర్ నాగ దుర్గ గుర్తున్నారా? తన అద్భుతమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ పల్లెటూరి పిల్లకు ఇప్పుడు అదృష్టం మామూలుగా కలిసి రావడం లేదు. సింగర్‌గా పాపులర్ అయిన నాగ దుర్గ.. ఇప్పుడు హీరోయిన్‌గా ఫుల్ బిజీ అయిపోతోంది.

ఇప్పటికే ‘కలివి వనం’ అనే చిన్న చిత్రంతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన నాగ దుర్గ.. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది. స్టార్ హీరో ధనుష్‌‌ మేనల్లుడు పవిష్‌‌ హీరోగా నటిస్తున్న ‘లవ్‌‌ ఓ లవ్‌‌’ అనే తమిళ చిత్రంలో నాగ దుర్గనే మెయిన్ హీరోయిన్. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ చూస్తే.. కథలో ఆమె పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్లియర్ గా అర్థమవుతోంది. జులైలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.

అయితే, ఈ తమిళ సినిమా రిలీజ్ కాకముందే.. నాగ దుర్గ టాలీవుడ్‌లో ఒక జాక్‌పాట్ ఆఫర్ కొట్టేసింది. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా.. స్టార్ డైరెక్టర్ సుకుమార్‌, టాప్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్‌ కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా తెరకెక్కబోతోంది. వంశీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీలో.. నాగ దుర్గను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. ఈ నెల 25న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ సినిమా.. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది.

Tags:    

Similar News