Arjun Reddy’s Beauty: స్లిమ్ గా మారినా అర్జున్ రెడ్డి బ్యూటీకి ఆఫర్స్ ఎక్కడ?

బ్యూటీకి ఆఫర్స్ ఎక్కడ?;

Update: 2025-07-10 08:30 GMT

Arjun Reddy’s Beauty: అర్జున్ రెడ్డి సినిమా హిట్టయినా సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం కెరీర్ లో సక్సెస్ అవ్వలేకపోయింది. షాలిని తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ఆమెకు అంతగా క్రేజ్ రాలేదు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఆతర్వాత కొన్ని ఆఫర్స్ అందుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. కాస్త బొద్దుగా మారడం సమస్య అయ్యిందని గుర్తించిన ఆమె స్లిమ్ గా మారి షాక్ ఇచ్చింది. అయితే అలా మారినా కూడా అమ్మడికి ఛాన్స్ లు రావట్లేదు. అటు కోలీవుడ్, బాలీవుడ్ లో అమ్మడు చేసిన ప్రయత్నాలు కూడా వర్క్ అవుట్ కాలేదు. బాలీవుడ్ లో ఎలాంటి సినిమా అయినా, పాత్ర అయినా చేస్తూ వస్తుంది షాలిని. ఎందుకో ఆమెకు అక్కడ లక్ కలిసి రావట్లేదు. టాలీవుడ్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. సినిమాలు చేస్తూ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది షాలిని. తన అందాలతో కుర్రాళ్లకు గాలాలు వేస్తుంది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది. మళ్లీ విజయ్ దేవరకొండ లాంటి హీరో సినిమాల్లో నటిస్తే కానీ షాలిని తిరిగి ఫాం లోకి వచ్చే అవకాశం ఉండదు. అర్జున్ రెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తే ఆడియన్స్ చూస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News