Raja Saab: నోరు జారిన మారుతి ..రాజాసాబ్ మూడున్నర గంటలా.?

రాజాసాబ్ మూడున్నర గంటలా.?;

Update: 2025-06-17 14:56 GMT

Raja Saab: డార్లింగ్ హీరో ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో వస్తున్న సినిమా రాజాసాబ్. ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్ కూడా అదిరాయి. టీజర్ తర్వాత సినిమాపై అంచనా రెట్టింపయ్యాయి. ఇదే సమయంలో సినిమా లెంగ్త్ మూడున్నర గంటలని తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి చెప్పడం ఈ గమనార్హం. టీజర్ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మారుతి సినిమా మూడున్నర గంటలు అని ముందుగా నోరు జారాడు. తర్వాత సవరించుకొని మూడు గంటలు అనేశాడు. ఇంతకు ఈ సినిమా లెంగ్త్ మూడున్నర గంటలా..? మూడు గంటలా అనే ఓ సందేహం లేవనెత్తి అలా వది

లేశాడు మారుతి.

ఈ సినిమాకు సంబంధించి చాలా కంటెంట్ తీశాడు మారుతి. ఇప్పటికే మూడు గంటల సినిమా తయారైంది. తీయాల్సిన సీన్లు కొన్ని ఉన్నాయి. పాటలు బాలెన్స్. అవన్నీ కలిపితే మూడున్నర గంటలు గ్యారెంటీ. దాన్ని ఎంత ట్రిమ్ చేసినా మూడు గంటల లెక్కయితే తేలుతుందనుకోండి. లెంగ్త్ పరంగా రాజాసాబ్ పెద్దదనే చెప్పాలి. పార్ట్ 2 కూడా ఉంటుందని, దానిని హాలీవుడ్ రేంజ్లో తీస్తామని ఇప్పటికే నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానున్న రాజాసాబ్ కోసం డార్లింగ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News