‘Kurchi Tata’ Passes Away: సోషల్ మీడియా సెన్సేషన్: కుర్చీ తాత మృతి

కుర్చీ తాత మృతి

Update: 2026-05-21 08:01 GMT

‘Kurchi Tata’ Passes Away: సోషల్ మీడియా ప్రపంచంలో తనదైన శైలిలో నవ్వులు పూయించిన ఒక సామాన్యుడు.. స్టార్ హీరో రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ఒక వెరైటీ తాత.. ఇక సెలవు తీసుకున్నారు. ‘ఆ కుర్చీని మడతపెట్టి’ అనే ఒక్క డైలాగ్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన 'కుర్చీ తాత' అలియాస్ మహ్మద్ పాషా కన్నుమూశారు.

హైదరాబాద్‌లోని కృష్ణానగర్ ప్రాంతంలో నివసించే మహ్మద్ పాషా.. బుధవారం సాయంత్రం కృష్ణకాంత్ పార్కు సమీపంలో తీవ్రమైన ఎండ దెబ్బకు గురయ్యారు. అక్కడ సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ఆయన్ని గమనించి ఇంటికి చేర్చారు. కానీ విషాదం ఏమిటంటే.. తన భార్య ఒడిలోనే ఆయన చివరి శ్వాస విడిచారు.

యూట్యూబ్ నుంచి వెండితెర వరకు..

గతంలో ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సరదాగా అన్న ఆ ఒక్క మాట.. రాత్రికి రాత్రే ఆయన్ని సోషల్ మీడియా సెన్సేషన్‌ను చేసింది. ఆ క్రేజ్ ఏకంగా మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా వరకు చేరింది. దర్శకుడు త్రివిక్రమ్ ఆయన డైలాగ్‌తోనే ఒక స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేయగా, ఆ పాటలో తాత కూడా మెరిసి మరింత పాపులర్ అయ్యారు.ఆ తర్వాత ఎన్నో టీవీ షోలు, ఇంటర్వ్యూలతో బిజీగా గడిపిన మహ్మద్ పాషా.. నేడు భౌతికంగా మన మధ్య లేకపోవడం సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags:    

Similar News