Payal Rajput Gets Emotional: క్షమించండి నాన్న..నాన్న మరణంపై పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్
నాన్న మరణంపై పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్;
Payal Rajput Gets Emotional: టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. పాయల్ రాజ్ పుత్ తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్(67) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆయన జులై 28న తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పాయల్ రాజ్ పుత్ ఆలస్యంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
తన తండ్రి మరణంతో పాయల్ రాజ్ పుత్ ఎమోషనల్ అయ్యింది. క్యాన్సర్ తో పోరాడుతోన్న మా నాన్నను బతికించుకోవడానికి చేయాల్సిందంతా చేశా. కానీ మా నాన్నను బతికించుకోలేకపోయా. సారీ నాన్న నన్ను క్షమించు అంటూ పోస్ట్ పెట్టింది. పలువురు నటీనటులు,ఆమె అభిమానులు ఆమెకు సానుభూతి తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
తెలుగులో ఆర్ఎక్స్ 100 తో ఫేమస్ అయిన పాయల్ రాజ్ పుత్ 'వెంకటలక్ష్మి' అనే పాన్-ఇండియా చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇది ఒక యాక్షన్-ప్యాక్డ్ రివెంజ్ డ్రామా. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది. 'కిరాతక' (తెలుగు), 'గోల్ మాల్' (తమిళం) వంటి చిత్రాలలో కూడా ఆమె నటిస్తోంది.