Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్ షురూ..టైటిల్ ఇదే

టైటిల్ ఇదే

Update: 2026-04-02 05:57 GMT

Sourav Ganguly Biopic: భారత క్రికెట్ గమనాన్ని మార్చిన ‘బెంగాల్ టైగర్’, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దాదా’ బయోపిక్ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది.ఈ చిత్రానికి ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో గంగూలీ పాత్రను టాలెంటెడ్ యాక్టర్ రాజ్‌కుమార్ రావ్ పోషిస్తుండగా.. విక్రమాదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ పాత్రలో గంగూలీలా కనిపించడం కోసం రాజ్‌కుమార్ రావ్ పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. గంగూలీ బాడీ లాంగ్వేజ్‌ను మ్యాచ్ చేయడం కోసం రాజ్ ఏకంగా 10 కేజీల బరువు పెరిగారట. దీని కోసం ఆయన తన డైట్‌ను పూర్తిగా మార్చేశారు. రోజుకు రెండు పిజ్జాలు, స్వీట్లు, ఆలూ పరాటాలు, బిర్యానీలను ఆహారంగా తీసుకున్నట్లు స్వయంగా రాజ్‌కుమార్ రావ్ వెల్లడించారు.

ఒకవైపు గంగూలీ క్రేజ్, మరోవైపు రాజ్‌కుమార్ రావ్ నటన.. వెరసి ఈ బయోపిక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. లార్డ్స్ మైదానంలో షర్ట్ విప్పిన గంగూలీ ధైర్యాన్ని రాజ్ వెండితెరపై ఎలా చూపిస్తారో చూడాలని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News