Sree Vishnu’s New Movie: శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఒక రోజు ముందే థియేటర్లలోకి..

ఒక రోజు ముందే థియేటర్లలోకి..

Update: 2026-02-21 13:36 GMT

Sree Vishnu’s New Movie: యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫన్ ఎంటర్‌టైనర్ విష్ణు విన్యాసం విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన ఫిబ్రవరి 28 కంటే ఒక రోజు ముందే, అంటే ఫిబ్రవరి 27, శుక్రవారం నాడే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తేదీ మార్పుకు కారణం:

వాస్తవానికి ఫిబ్రవరి 27న విడుదల కావాల్సిన శ్రీవిష్ణు మరో సినిమా మృత్యుంజయ వాయిదా పడటంతో ఆ ఖాళీని విష్ణు విన్యాసంతో భర్తీ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. వీకెండ్ అడ్వాంటేజ్‌తో మంచి ఓపెనింగ్స్ రాబట్టడమే దీని లక్ష్యం. ఈ విషయాన్ని శ్రీవిష్ణు తన స్టైల్లో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "మీ జాతకంలో ఫిబ్రవరి 27 నుంచి నాన్-స్టాప్ ఫన్ దోషం మొదలవుతుంది" అంటూ చమత్కరించారు. మూఢనమ్మకాలు, జాతకాలను విపరీతంగా నమ్మే యువకుడి పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నారు. యదునాథ్ మారుతి రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags:    

Similar News