Sreeleela: గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్న శ్రీలీల
రచ్చ చేస్తున్న శ్రీలీల;
Sreeleela:సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేసిన డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.. ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉంది. జూనియర్స్, మాస్ జాతర, లెనిన్ అనే చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు కార్తీక్ ఆర్యన్ సరసన ఓ చిత్రంలో ఈ అందాల భామే హీరోయిన్. ఇది ఆషిఖి ఫ్రాంఛైజీ నుంచి వస్తు న్న సినిమాగా ప్రచారం ఉన్నా, అలాంటిదేమీ లేదని చిత్రబృందం తెలిపింది. ఇటీవల పరాశక్తి అనే తమిళ చిత్రంలోనూ ఈ భామ నటించింది. ఇక అందానికి అందం, ప్రతిభ ఈ అమ్మడి సొంతం. ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రా ళ్లతో పాటు సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. మరోవైపు ఫ్యాషన్ సెన్స్ లోనూ ఈ తెలుగమ్మాయి తగ్గేదే లే! అంటోంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు లాంటి మెట్రో నగరాల నుంచి వచ్చిన చాలా మంది టాప్ మోడల్స్ కి గట్టిగా పోటీనిస్తోంది. అయితే గత కొంత కాలంగా శ్రీలీల ఇన్ స్టాలో స్పెషల్ ఫొటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఈ అమ్మడు సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. 'చాలా రోజుల తర్వాత' అంటూ క్యాప్షన్ జోడించిన ఆమె స్టైలిష్ లుక్స్ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ప్రత్యేకంగా ఈభామ ధరించిన గాజులు మరింత ఆకర్షణగా మారాయి. సింపుల్ గా నవ్వేస్తూ, హాఫ్ షోల్డర్ ఫ్రాక్‌లో ప్లెజెంట్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ గజిబిజి షూట్ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.