Ranveer Singh and Sreeleela to Team Up: రణవీర్ సింగ్‌తో జోడీ కట్టనున్న శ్రీలీల..త్వరలోనే..

త్వరలోనే..;

Update: 2025-07-26 09:31 GMT

Ranveer Singh and Sreeleela to Team Up:  నటి శ్రీలీల వెండితెరపై వెలిగిపోతోంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ భామకు ఫుల్ డిమాండ్‌ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ పెద్ద ఆఫర్లు అందుకుంటుంది. శ్రీలీల ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమా చాలా హైప్ క్రియేట్ చేసింది. ఇంతలో ఆమెకు మరో పెద్ద ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. శ్రీలీల రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సినిమా చేయనుందని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, శ్రీలీల మాత్రమే కాదు బాబీ డియోల్ కూడా నటించనున్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి.

శ్రీలీల గ్లామర్, నటన తో అభిమానులను అలరిస్తుంది. ఇప్పటికే 'పుష్ప 2' సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడన్ సినీ ప్రేమికులను ఆకర్షించింది. దీంతో బాలీవుడ్‌లో ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అటు ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. రణ్‌వీర్ సింగ్, బాబీ డియోల్, శ్రీలీల నటించే ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ఇది యాక్షన్, డ్రామాతో తెరకెక్కనుంది. రణవీర్ సింగ్ వరుసగా సినిమాలతో అలరిస్తున్నాడు. ఇటీవలే 'దురందర్' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించింది. రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Tags:    

Similar News