కన్నడ నటుడు దర్శన్‌కు సుప్రీకోర్టు షాక్‌

హత్యకేసులో బెయిల్‌ రద్దు చేసిన సుప్రీం కోర్టు;

Update: 2025-08-14 07:16 GMT

శాండిల్‌వుడ్‌ స్టార్‌ నటుడు దర్శన్‌ తూగుదీప్‌కు సుప్రీంకోర్టు పెద్ద షాక్‌ ఇచ్చింది. ఒక హత్య కేసులో కర్నాటక హైకోర్టు దర్శన్‌కు మంజూరు చేసిన బెయిల్ని సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎవుర్కొని అరెస్ట్‌ అయిన దర్శన్‌ తూగుదీప ప్రస్తుతం బెయిల్‌ మీద ఉన్నారు. గురువారం దర్శన్‌ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ మంజూరు, రద్దు అనే రెండు అంశాలను పరిశీలించామని వెల్లడించింది. దర్శన్‌ బెయిల్‌ విషయంలో కర్నాటక హైకోర్టు యాంత్రికంగా అధికారాన్ని వినియోగించినట్లు కనిపిస్తోందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దర్శన్‌కు బెయిల్‌ మంజూరు చేయడం వల్ల అది విచారణపై ప్రభావం చూపుతుందని, సాక్షులను భావితం చేసే అవకాశం కూడా లేకపోలేదని అందువల్ల దర్శన్‌ బెయిల్‌ రద్దు చేస్తున్నట్లు జస్టిస్‌ మహదేవన్‌ వ్యాఖ్యానించారు. కన్నడ నటుడు దర్శకు వీరాభిమానిగా చెపుతున్న రేణుకాస్వామి అనే వ్యక్తి నటి పవిత్ర గౌడకు అసభ్య మెసేజులు పింపిస్తున్నాడనే కోపంతో 2004 జూన్‌ మాసంలో దర్శన్‌ అతని రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసి బెంగుళూరులోని ఓ షెడ్డులో అతన్ని మూడు రోజులు బంధించి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అంతే కాకుండా శవాన్ని ఒక డ్రైన్‌లో పడేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో దర్శన్‌, పవిత్ర గౌడ్‌లతో పాటు మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరెస్ట్‌ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్‌ 13న కర్నాటక ప్రభుత్వం దర్శన్‌కు రెగ్యులర్‌ బెయిల్ మంజూరు చేసింది. అయితే కర్నాటక హైకోర్టులో బెయిల్‌ లభించిన వారిలో దర్శనతో పాటు మరో ఆరుగురి బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్ను విచారించిన సర్వోన్నత న్యాయ స్ధానం గురువారం నటుడు దర్శన్‌ బెయిల్‌ రద్దు చేసింది.

Tags:    

Similar News