Suriya’s ‘Karuppu’: సూర్య కరుప్పు రిలీజ్ ఎపుడంటే.?

రిలీజ్ ఎపుడంటే.?

Update: 2026-03-12 08:03 GMT

Suriya’s ‘Karuppu’: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథా నాయకుడిగా నటిస్తున్న కరుప్పు చిత్రం గురించి సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా రక రకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దర్శకుడికి, నిర్మాతకు మధ్య విభేదాలు తలెత్తాయని.. అందుకే రిలీజ్ లో జాప్యం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు ఆర్జే బాలాజీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మూవీ ఎలాంటి చిక్కుల్లో లేదని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశాడు.

సినిమా ఆలస్యం కారణంగా అభిమానులు నిరాశపడుతున్నట్లు తనకు అర్ధం అవుతుందని, వారి నిరీక్షణకు తగిన ఫలితం ఉంటుందని చెప్పాడు. ఏప్రిల్ 10న ఈ సినిమా రిలీజ్ కావడం లేదని స్పష్టం చేశాడు. పది రోజుల్లో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ మూవీ ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య సరసన త్రిష నటిస్తుండగా, ఇంద్రాన్స్, నట్టి, స్వాసిక, శివద పంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సూర్య సరసన చాలా కాలం తర్వాత త్రిష నటిస్తోంది. వీరిద్దరూ 'ఆరు' సినిమా తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో సూర్య 'శరవణన్' అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. సామాజిక న్యాయం, కుల వివక్ష వంటి అంశాల నేపథ్యంలో సాగే కోర్ట్ రూమ్ డ్రామా ఇది.

Tags:    

Similar News