Tarun Bhascker’s New Film Titled ‘Gayapadda Simham’: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా.. ‘గాయపడ్డ సింహం’ టైటిల్ ఫిక్స్!
‘గాయపడ్డ సింహం’ టైటిల్ ఫిక్స్!
Tarun Bhascker’s New Film Titled ‘Gayapadda Simham’: నటుడిగానూ బిజీ అవుతున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘గాయపడ్డ సింహం’ అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే 'ఓం శాంతి శాంతి శాంతిహి'లో మెరిసిన తరుణ్ భాస్కర్, ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కాశ్యప్ శ్రీనివాస్ రచన చేసి దర్శకత్వం వహిస్తుండగా, ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో బిజీగా ఉన్న దర్శకుడు పవన్ సాదినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తున్నారు. శుక్రవారం విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
పోస్టర్ డిజైన్ చాలా డిఫరెంట్‌గా, అమెరికన్ స్టైల్ ఇలస్ట్రేషన్లతో ఆకట్టుకుంటోంది. ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్న ఈ పోస్టర్‌లో విమానం, అమెరికా జెండాను తలపించే గీతలు ఉన్నాయి. అలాగే దీనికి “డోంట్ లాఫ్! ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్!” (నవ్వకండి! ఇది చాలా సీరియస్ విషయం!) అనే ఫన్నీ టాగ్ లైన్ ఇచ్చారు. దీన్ని బట్టి ఇదొక సాటైరికల్ (వ్యంగ్యాస్త్రం) మూవీ అని అర్థమవుతోంది.