'Thalaivar 173' (working title) Director: ఉత్కంఠకు తెర.. డైరెక్టర్ ఎవరో తేలింది!
డైరెక్టర్ ఎవరో తేలింది!
'Thalaivar 173' (working title) Director: సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం 'తలైవర్ 173' (వర్కింగ్ టైటిల్) డైరెక్టర్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. 'డాన్' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సిబి చక్రవర్తి ఈ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నారు. జనవరి 3న చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేసింది,
సుమారు 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం విశేషం. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) పై నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించినప్పటికీ, స్క్రిప్ట్ విషయంలో వచ్చిన విభేదాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత పలువురు దర్శకుల కథలను పరిశీలించిన రజనీకాంత్.. చివరకు సిబి చక్రవర్తి చెప్పిన లైన్‌కు ఫిదా అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి (పొంగల్) కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు సిబి చక్రవర్తి మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్ 'కూలీ' షూటింగ్ పూర్తి చేసి, 'జైలర్ 2' పనుల్లో ఉండగా, ఆ వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా విభిన్నంగా ఉంది. టైలరింగ్ సామాగ్రి (కత్తెరలు, సూదులు, దారాలు), బుల్లెట్లు ఉన్న ఈ పోస్టర్‌పై “Every family has a hero” (ప్రతి కుటుంబంలో ఒక హీరో ఉంటారు) అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీనిని బట్టి ఇదొక ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.