Sonali Bendre: ఆ హీరోకు థ్యాంక్స్.. నాకెంతో మద్దతు ఇచ్చాడు : సోనాలి బింద్రే

నాకెంతో మద్దతు ఇచ్చాడు;

Update: 2025-06-10 05:12 GMT

Sonali Bendre:'మురారి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మురిపించిన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేశ్ బాబులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈఅందాల తార.. హిందీలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే కెరీర్ లో రెండుసార్లు బ్రేక్ తీసుకున్న సోనాలి.. ఇటీవలే 'ది బ్రోకెన్ న్యూస్' రెండో సీజన్లో లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈభామ తన వ్యక్తిగత అనుభవాల ను పంచుకుంది. 'ఓ సినిమా సీక్వెల్లో నటించే టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయినా విరామం తీసుకోలే దు. 8 నెలల పాటు రోజూ షూటింగ్ కు వచ్చేదాన్ని. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బ్రేక్ తీసుకున్నాను. మాతృత్వాన్ని ఆస్వాదించాను. ఆ తర్వాత టీవీ షో ద్వారా ప్రేక్షకులను పలకరించా ను. అయితే ఆ షో చేస్తున్నప్పుడే క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే అమెరికాలో చికిత్స తీసుకున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ నాకెంతో ధైర్యాన్ని చ్చాడు. ట్రీట్మెంట్ ఎలా సాగుతుందని పదేపదే ఆరా తీశాడు. ఏకంగా రెండుసార్లు న్యూయార్క్ వచ్చి నన్ను పరామర్శించాడు. అలాగే పలు సార్లు నా భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన డాక్టర్లు ఉన్నారో లేదో తెలుసుకున్నాడు. ఆ టైంలో కోలుకోవడా నికి ఆయన నాకెంతో మద్దతు ఇచ్చారు' అంటూ సల్మాన్ కు థ్యాంక్స్ చెప్పింది. కాగా 1999లో వచ్చిన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమాలో జంటగా నటించారు సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ తీరుపై విమర్శలు చేసింది సోనాలి

Tags:    

Similar News