‘కన్నప్ప’ సినిమా కేవలం కథ కాదు, ఆధ్యాత్మిక యాత్ర - శరత్‌కుమార్
The movie 'Kannappa' is not just a story, it's a spiritual journey - Sarathkumar;
‘కన్నప్ప’ సినిమా కేవలం కథ కాదు, ఆధ్యాత్మిక యాత్ర - శరత్‌కుమార్
భక్తి, విశ్వాసం మధ్య మానవ విలువల పోరాటమే కన్నప్ప సినిమా అని సీనియర్ నటుడు శరత్ కుమార్ చెప్పారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా గురించిన విశేషాలు పొలిటెంట్ మీడియాకు వెల్లడించారు. ఈ సినిమాలోని భక్తి, నమ్మకం, కుటుంబ బంధాల గురించి గాఢమైన భావోద్వేగాల గురించి వివరించారు. భక్తుడి మార్గంలో నమ్మకాన్ని ఎలా పెంపొందించాలో ఈ సినిమాలో చూడబోతున్నారన్నారు. ఈ సినిమాతో భక్తి, అవిశ్వాసం మధ్య తండ్రి-కొడుకు మధ్య మానసిక పోరాటం ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కబోతోంది.
ఈ సినిమా కేవలం ఒక పౌరాణిక సినిమా కాదని, ఇది భక్తి మీద ఆధారపడి ఆధునిక యువతలో నమ్మకాన్ని నాటాలని ప్రయత్నించే కథ అని చెప్పారు. కన్నప్ప అసలు పేరు తేనుగుడె. వేటగాడు అయిన అతను అరణ్యంలో శివలింగాన్ని కనుగొని, అచంచల భక్తుడిగా మారుతాడు. అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు భక్తితో శివునికి పూజ చేస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య భక్తికి అసలు అర్థం ఏంటి? అనే సందేశంతో కథ సాగుతుంది. ఈ సినిమాలో తండ్రిగా నటించిన శరత్‌కుమార్ పాత్ర భావోద్వేగంతో కూడుకున్నది. ఈ పాత్ర తనకెంతో నచ్చిందని, ఇది కేవలం కఠిన తండ్రి పాత్ర కాదని, విలువలు నేర్పే ఒక మార్గదర్శక తండ్రి పాత్ర అని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ నటులు నటించారు. అందరూ ఒకే సినిమాలో కనిపించడం తనకు కొత్త అనుభవం అని, ఇది తమ ఇండస్ట్రీ ఏకత్వానికి నిదర్శనమని తెలిపారు. ప్రతి రోజు ఉదయం లేచి దేవుడికి ధన్యవాదాలు చెప్పటం తనకు అలవాటు అని, జీవితంలోని ప్రతి సందర్భాన్ని తాను ఒక అనుభవంగా చూస్తానని, విజయం, వైఫల్యం, రెండింటినీ నేర్చుకునే అవకాశాలుగా చూస్తానని చెప్పారు. ఈ చిత్రం ఆధునిక యువతకు నమ్మకం, సంస్కృతి పట్ల గౌరవం పెంచేలా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో యువత చాలామంది నమ్మకాన్ని కోల్పోతున్నారని, అలాంటి వారిని మన సంస్కృతివైపు తీసుకురావటానికి కథలే ఒక మార్గం అని అభిప్రాయపడ్డారు.