The Paradise: ది ప్యారడైజ్ ..హైదరాబాద్ శివార్లో 30 ఎకరాల్లో భారీ సెట్

హైదరాబాద్ శివార్లో 30 ఎకరాల్లో భారీ సెట్

Update: 2025-09-09 09:09 GMT

The Paradise: నాని కొత్త సినిమా ది ప్యారడైజ్ .ఈ చిత్రానికి 'దసరా' సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ఒక కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది.

ది పారడైజ్' కోసం మూవీ మేకర్స్ లేటెస్ట్ గా ఒక వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సినీ చరిత్రలోనే అతిపెద్ద సెట్ ను నిర్మిస్తున్నారు. ఇది అత్యంత ప్రత్యేకమైన సెట్‌లలో ఒకటిగా నిలిచిపోయేలా రూపొందిస్తున్నారు. దీని కోసం హైదరాబాద్ శివార్లలో 30 ఎకరాల విస్తీర్ణంలో 1940 నాటి ఒక గ్రామాన్ని తలపించేలా భారీ సెట్‌ను నిర్మించారు. ఈ సెట్ లో వాస్తవంగా ఆ కాలంలో ఉన్న కట్టడాలు, వీధులు, ఇళ్లను పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సెట్‌ను 'బాహుబలి'లో మహిష్మతి సెట్‌తో పోల్చుతున్నారు. ఈ కథ ఒక పవర్ ఫుల్ యువకుడు ఒక బస్తీలో పుట్టి నాయకుడిగా ఎలా ఎదిగాడనే దానిపై ఉంటుంది.

ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ ,ఇంగ్లీష్, స్పానిష్ వంటి భాషల్లో 2026 మార్చి 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. శ్రీకాంత్ ఓదెల నెక్ట్స్ మూవీ చిరంజీవితోనే కాబట్టి ఈ అతిథి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సినిమా

Tags:    

Similar News