‘The Paradise’ Release Date Locked: ది ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. రూమర్లకు చెక్ పెట్టిన నాని.. ఆ రోజే వరల్డ్ వైడ్ ఎంట్రీ..

రూమర్లకు చెక్ పెట్టిన నాని.. ఆ రోజే వరల్డ్ వైడ్ ఎంట్రీ..

Update: 2026-05-12 15:10 GMT

‘The Paradise’ Release Date Locked: నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్ చుట్టూ గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వదంతులకు చిత్ర యూనిట్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సినిమా లేట్ అవుతోందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ, అందరూ ఎదురుచూస్తున్న విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

రీషూట్ లేదు.. జాప్యం అంతకన్నా

లేదు

సినిమా షూటింగ్ నెమ్మదించిందని, కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చిత్ర బృందం ఘాటుగా స్పందించింది. "మేము తొలి రోజు నుంచి పక్కా ప్లానింగ్‌తోనే ఉన్నాం. ఇప్పటివరకు 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయింది. ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదు, ఆ అవసరం కూడా మాకు లేదు" అని టీమ్ స్పష్టం చేసింది.

వార్తల్లో బాధ్యత ఉండాలి..

సినిమా గురించి వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, ఏదైనా అప్‌డేట్ ఉంటే అధికారికంగా తామే ప్రకటిస్తామని టీమ్ తెలిపింది. అసత్య వార్తలు ప్రచారం చేసే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించింది.

రిలీజ్ డేట్ ఖరారు

అన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ సజావుగా సాగుతున్న ఈ చిత్రాన్ని 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News