The Paradise: నేచురల్ స్టార్ నాని అభిమానులకు , సినీ ప్రేక్షకులకు అదిరిపోయే తీపి కబురు! శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ది ప్యారడైజ్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.

అయితే, గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు హల్‌చల్ చేశాయి. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని, ఒక పాట షూటింగ్ కూడా బాకీ ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఆ రూమర్స్ అన్నింటికీ చిత్రబృందం గట్టి చెక్ పెట్టింది! సినిమా వాయిదా పడటం లేదని, ముందుగా ప్రకటించినట్లే సెప్టెంబరు 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్నట్లు అధికారికంగా స్పష్టం చేసింది.

కేవలం సెప్టెంబరు 24న విడుదల చేయడమే కాకుండా, సెప్టెంబరు 23వ తేదీ రాత్రే గ్రాండ్ స్పెషల్ ప్రీమియర్లను ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను రీలీజ్ చేసి రూమర్లకు పూర్తిగా తెరదించారు.

గతంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన 'దసరా' తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇందులో నాని 'జడల్' అనే మాస్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. మోహన్ బాబు, తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో అలరించనున్నారు.

ఏదేమైనా, విడుదలపై వచ్చిన పుకార్లకు చెక్ పడటంతో నాని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరి 'దసరా' కాంబో మ్యాజిక్‌ను 'ది ప్యారడైజ్' ఎంతవరకు రిపీట్ చేస్తుందో చూడాలంటే సెప్టెంబరు 24 వరకు వేచి చూడాల్సిందే.

Tags: