The Raja Saab: ది రాజాసాబ్.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే.?

Update: 2026-01-09 06:15 GMT

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన "ది రాజా సాబ్" ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ఏ ప్రీమియర్స్ మరియు మార్నింగ్ షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో పబ్లిక్ తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు.

ప్లస్ పాయింట్స్

మొత్తంగా చూస్తే సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. అభిమానులు ప్రభాస్ 'వింటేజ్ లుక్' 'కామెడీ టైమింగ్' బాగుందని సంబరపడుతుంటే, సాధారణ ప్రేక్షకులు మాత్రం కథలో కొత్తదనం లేదని అభిప్రాయపడుతున్నారు.

చాలా కాలం తర్వాత ప్రభాస్ క్లాస్ లుక్‌లో, తన పాత సినిమాల తరహా (బుజ్జిగాడు, డార్లింగ్) వెటకారం,ఎనర్జిటిక్ కామెడీతో ఆకట్టుకున్నారు. సినిమా చివర 40 నిమిషాలు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయని టాక్.ప్రభాస్, సంజయ్ దత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని ప్రేక్షకులు చెబుతున్నారు.తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) హారర్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది.

మైనస్ పాయింట్లు:

సినిమా రన్ టైమ్ (దాదాపు 3 గంటలు) కొంచెం ఎక్కువైందని, అక్కడక్కడ బోర్ కొట్టిస్తుందని కొందరు అంటున్నారు. కొన్ని సీన్స్‌లో గ్రాఫిక్స్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వస్తున్నాయి. హారర్-కామెడీ జోనర్ కావడం వల్ల కథలో పెద్దగా ట్విస్టులు లేవని, మారుతి మార్క్ కామెడీ కొన్ని చోట్ల మాత్రమే పేలిందని టాక్.ప్రముఖ రివ్యూ సైట్లు, ప్రేక్షకుల సగటు రేటింగ్ 2.5 నుండి 3.25/5 మధ్యలో ఇస్తున్నారు.

బాటమ్ లైన్

ప్రభాస్ ఫ్యాన్స్ ఆయితే 'వింటేజ్ స్వ్యాగ్' కోసం ఒకసారి చూడవచ్చు. కేవలం కామెడీ, హారర్ ఆశించే వారికి ఇది ఒక యావరేజ్ ఎంటర్‌టైనర్.

Tags:    

Similar News