The Raja Saab : ముగ్గురి బామలతో ప్రభాస్ తీన్ మార్..
ప్రభాస్ తీన్ మార్..;
The Raja Saab : The Raja Saab :ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ టీజర్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. తెలుగు టీజర్ విడుదలైన 8 గంటల్లో 8 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. హారర్, కామెడీ, రొమాన్స్‌తో టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ప్రభాస్ డీసెంట్ లుక్స్, స్వీట్ డైలాగ్స్, హారర్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. హారర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టడమే కాకుండా ఆసక్తిని రేపే కామెడీతో కలర్ ఫుల్‌గా ఉంది.
అయితే టీజర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజాసాబ్ లో ఏదైనా డ్యాన్స్ నెంబర్ ఉందా అని మీడియా వాళ్లు అడగ్గా.. హీరో ఎంట్రీ సాంగ్ ఉంటుంది. ముగ్గురు హీరోయిన్స్‌తో హీరోకు ఒక చక్కని పాట ఉంటుంది. ఇందులో వచ్చే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. తమన్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఇప్పుడొచ్చింది.. జస్ట్ టీజర్ మాత్రమే.. ట్రైలర్, సినిమా మీరు ఊహించలేరని' మారుతి చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు.ఈ సినిమా డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.