‘Fauji’: తిరుగుబాటు మొదలైంది.. రక్తం ఓడుతున్న లుక్‌లో రెబల్ స్టార్.. ఫౌజీ విడుదల ఎప్పుడంటే?

ఫౌజీ విడుదల ఎప్పుడంటే?

Update: 2026-07-16 14:48 GMT


‘Fauji’: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఫౌజీ విడుదల తేదీ ఖరారైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక యుద్ధ నేపథ్య చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ నెట్టింట రచ్చ లేపుతోంది. అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇక తిరుగుబాటు మొదలైంది.. అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో రెబల్ స్టార్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యుద్ధభూమిలో ఒంటి నిండా రక్తంతో, చేతిని తుపాకీపై ఉంచి కూర్చున్న ప్రభాస్ రగ్గడ్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్‌పై ‘1932 నుంచి మోస్ట్ వాంటెడ్’ అని ఉన్న స్టాంప్ కథలోని తీవ్రతను, విప్లవాత్మక కోణాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ దిగ్గజాలు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగంలో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా త్వరలోనే ఓ క్రేజీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సీతారామం వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి ఈ కథను సిద్ధం చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్‌ను, సర్‌ప్రైజ్‌ను ఇస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు.

Tags:    

Similar News