Suriya: 20 ఏళ్లయినా అదే ప్రేమ ఉండాలి: వైవాహిక బంధంపై హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2026-08-04 04:31 GMT

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అద్భుతమైన నటనతోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. ముఖ్యంగా భార్య జ్యోతికతో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వైవాహిక జీవితం , ప్రేమ గురించి సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూర్య మాట్లాడుతూ.. మనం ఎవరితోనైనా ఇరవయ్యేళ్లు కలిసి ప్రయాణించినా సరే, వారిపై చూపించే ప్రేమ, అభిమానం ఎప్పుడూ ఒకేలా తాజాదానంతో ఉండాలని అన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ బాధ్యతలు మారవచ్చు, వయసు పెరగవచ్చు కానీ భాగస్వామిపై ఉండే ప్రేమ మాత్రం మొదటి రోజు ఎలా ఉందో అలాగే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం చాలా ముఖ్యమని సూర్య పేర్కొన్నారు.

సూర్య చెప్పిన ఈ సున్నితమైన ,అర్థవంతమైన మాటలు నేటి తరానికి రిలేషన్‌షిప్ గోల్స్‌లా ఉన్నాయని అభిమానులు కొనియాడుతున్నారు. తెరపైనే కాక నిజ జీవితంలోనూ ఒక నిజమైన ప్రేమికుడిగా సూర్య మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు!

Tags:    

Similar News