The Untold Story Behind Aadi: ఆది వెనుక అసలు కథ.. ఎన్టీఆర్ కోసం వినాయక్ రాసుకున్నది లవ్ స్టోరీ అని మీకు తెలుసా?

ఎన్టీఆర్ కోసం వినాయక్ రాసుకున్నది లవ్ స్టోరీ అని మీకు తెలుసా?

Update: 2026-03-26 06:05 GMT

The Untold Story Behind Aadi: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఆది సినిమా ఒక సంచలనం. అయితే, ఈ సినిమా వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని వినాయక్ తాజాగా పంచుకున్నారు. తారక్ కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పిన ఆ సినిమా నిజానికి ఒక క్యూట్ లవ్ స్టోరీగా మొదలవ్వాల్సింది..

లవ్ స్టోరీ నుంచి ఫ్యాక్షన్ వైపు..

కెరీర్ ఆరంభంలో వినాయక్, తారక్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేశారట. ఆ కథను తారక్‌కు వినిపిస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన కొడాలి నాని జోక్యం చేసుకోవడం ఈ ప్రాజెక్ట్ గమనాన్నే మార్చేసింది. "మా హీరోతో లవ్ స్టోరీ వద్దు.. మాస్ జనాన్ని ఊపేసే ఒక పక్కా కమర్షియల్ సినిమా తీయండి" అని కొడాలి నాని సూచించారట.

ఆ ఒక్క మాట వినాయక్ ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. వెంటనే ఆ లవ్ స్టోరీని పక్కన పెట్టి, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఆది కథను సిద్ధం చేశారు.

మాస్ హీరోగా తారక్ విశ్వరూపం..

2002లో విడుదలైన ఆది సినిమాతో ఎన్టీఆర్ ఒక్కసారిగా మాస్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. అమ్మ తోడు.. అడ్డంగా నరికేస్తా' అనే డైలాగ్ అప్పట్లో థియేటర్లను షేక్ చేసింది. ఈ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వినాయక్‌ను ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది.

Tags:    

Similar News