Hollywood: ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా
అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా
Hollywood: సినిమాల నిర్మాణం కోసం డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. మన దేశంలో ఒక్కో సినిమాకు 500 కోట్లు, 700 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమాల బడ్జెట్ పెరిగింది. హాలీవుడ్ సినిమాలకు ఎప్పుడూ పెద్ద బడ్జెట్ ఉంటుంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థ మార్వెల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సినిమాను నిర్మిస్తోంది. మార్వెల్ నిర్మించిన బ్లాక్ బాస్టర్ సిరీస్ అవెంజర్స్ లో కొత్తగా వస్తోన్న సినిమా అవెంజర్స్: డూమ్స్‌డే.
మార్వెల్ సంస్థ కొన్ని వారాల క్రితమే 'అవెంజర్స్: డూమ్స్‌డే' సినిమా తీస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో భారీ స్టార్ తారాగణం ఉంటుంది. ఈ సినిమాలో నటించే నటులు, నటీమణుల జీతాలు 2150 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కు దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు 6 వేల కోట్లు ఖర్చవుతుందని సమాచారం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ కలుకుంటే 900 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో స్టార్ వార్స్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బడ్జెట్ చిత్రంగా నిలిచింది. కానీ 'అవెంజర్స్: డూమ్స్ డే' సినిమా ఆ సినిమా కంటే రెండింతల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 'అవెంజర్స్: డూమ్స్ డే' సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, టామ్ హిడిల్‌స్టన్, వెనెస్సా, ఫ్లోరెన్స్ సహా చాలా మంది అగ్ర తారలు నటిస్తున్నారు. అందుకే సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది.